ETV Bharat / state

అక్కినేని నాగార్జున ఇంట్లో కుటుంబ సర్వే - అన్ని ప్రశ్నలకు వివరాలు చెప్పిన అమల - TELANGANA SAMAGRA KUTUMBA SURVEY

రాష్ట్రవ్యాప్తంగా సాగుతోన్న సమగ్ర కుటుంబ సర్వే - సినీనటుడు అక్కినేని నాగార్జున ఇంటికి వెళ్లి వివరాలు సేకరించిన ఎన్యూమరేటర్లు - ప్రశ్నలకు సమాధానం చెప్పిన అక్కినేని అమల

Family Survey Akkineni Nagarjuna House
Family Survey Akkineni Nagarjuna House (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 19, 2024, 9:53 PM IST

Updated : Nov 19, 2024, 10:02 PM IST

Family Survey Akkineni Nagarjuna House : రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో ఎన్యూమరేటర్లకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. కుటుంబ వివరాలను సేకరించేందుకు ఇళ్లకు వెళితే వారు ఇచ్చే సమాధానాలతో అవాక్కు అవుతున్నారు. మా కుటుంబ సమాచారం మీకు ఇవ్వాల్సిన అవసరం ఏంటీ?, మేం రిచ్​ పీపుల్​.. మాలాంటి వారికి ఈ సర్వేలు కాదు, కుక్కలను ఎన్యూమరేటర్లపైకి విడిచిపెట్టడం, దుర్భాషలాడటం వంటి సంఘటనలు చూస్తూనే ఉన్నాం. కానీ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున సతీమణి చేసిన పనికి మాత్రం అందరూ హ్యాట్సాప్​ చెప్పాల్సిందే. సాధారణ వ్యక్తిలా ఎన్యూమరేటర్లు అడిగే అన్ని ప్రశ్నలకు సమాచారం అందించడమే కాకుండా.. ఓ మెసెజ్​ను సైతం ఇచ్చారు.

కుటుంబ వివరాలు తెలిపిన అక్కినేని అమల : రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే వేగంగా సాగుతోంది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్​ రోడ్​ నెంబర్​ 54లో ఉన్న సినీ నటుడు అక్కినేని నాగార్జున ఇంటికి సర్వే ఎన్యూమరేటర్లు వెళ్లారు. అక్కడ వారికి అక్కినేని నాగార్జున భార్య అమల అన్ని వివరాలను వెల్లడించారు. సర్వేలే భాగంగా అడిగే 75 ప్రశ్నలతో కూడిన వివరాలను పరిశీలించారు. అనంతరం వారికి సమాచారం అందించారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర ప్రజలకు ఓ సందేశాన్ని ఇచ్చారు.

Family Survey Akkineni Nagarjuna House
కుటుంబ సభ్యుల వివరాలను చెబుతున్న అక్కినేని అమల (ETV Bharat)

రాష్ట్రప్రభుత్వం చేస్తున్న కుటుంబ సర్వే వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అక్కినేని అమల తెలిపారు. అందుకు ప్రతి ఒక్కరు సర్వేలో పాల్గొని అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇవ్వాలని సూచించారు. తాను కూడా అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూ, అన్ని వివరాలు వెల్లడించడం జరిగిందని తెలిపారు. ఎలాంటి గర్వం లేకుండా ఎన్యూమరేటర్లకు సహకరిస్తూ తన కుటుంబ వివరాలను చెప్పారు. ఈ సర్వేలో ఎన్యుమరేటర్​ వినయ్​ కుమార్​, సూపర్​వైజర్​ శివకుమార్​, సర్కిల్​ మోడల్​ ఆఫీసర్​ శ్రీనివాస్​ పాల్గొన్నారు.

కుటుంబ వివరాలు వెల్లడించిన గవర్నర్ : పది రోజుల క్రితం రాజ్​భవన్​లో గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ.. సమగ్ర కుటుంబ సర్వేకు తన కుటుంబ సభ్యుల వివరాలను వెల్లడించారు. సర్వేకు ప్రజలందరూ సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ ప్రజలకు పిలుపునిచ్చారు.

కుటుంబ సర్వే : ఫ్రిజ్​లు, ఏసీలు, కార్లు ఉన్నవారికి సంక్షేమ పథకాలు కట్! - క్లారిటీ ఇచ్చిన మంత్రి

ఇంటికి వెళితే ఉండరు - ఆస్తి వివరాలు అడిగితే చెప్పరు - ఎన్యూమరేటర్లకు తప్పని సర్వే అష్టకష్టాలు

Last Updated : Nov 19, 2024, 10:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.