వారెవ్వా ఆకాశంలో పెళ్లి వెరీ ఇంట్రెస్టింగ్ - ఎయిర్ బెలూన్‌లో పెళ్లి జంట వినూత్న రీతి
🎬 Watch Now: Feature Video
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ జంట వినూత్న రీతిలో హాట్ ఎయిర్ బెలూన్‌లో వివాహం చేసుకుంది. దుర్గ్ ప్రాంతానికి చెందిన వ్యాపారి ఆవదేశ్ పాండే కుమార్తె ప్రీతి అదే ప్రాంతంలో ఉండే దీనబంధు తివారీ కుమారుడు రవి పెళ్లి నవంబర్ 25న జరిగింది. వినూత్నంగా ఆలోచించిన ఈ జంట 100 అడుగుల ఎత్తులోకి వెళ్లి కలకాలం ఒకరికి ఒకరు తోడుంటామని ప్రమాణం చేసుకున్నారు. జీవితాంతం గుర్తుండిపోవాలనే ఇలా వివాహం చేశామని పెళ్లి కుమార్తె తండ్రి తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST