టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ రాజీనామా - అశోక్‌నగర్‌లో నిరుద్యోగుల సంబురాలు - టీఎస్‌పీఎస్సీకి ఛైర్మన్ రాజీనామాతో సంబరాలు
🎬 Watch Now: Feature Video
Published : Dec 12, 2023, 11:51 AM IST
Unemployed Celebrations in Hyderabad : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా జనార్దన్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో నిరుద్యోగులు సంబురాలు జరుపుకున్నారు. పోటీ పరీక్షలకు కేంద్రంగా మారిన హైదరాబాద్ అశోక్ నగర్లో నిరుద్యోగ అభ్యర్థులు బాణసంచా కాల్చి పరస్పరం మిఠాయిలు తినిపించుకున్నారు. 2023 ఎన్నికలు నిరుద్యోగులకు, బీఆర్ఎస్ పార్టీ మధ్య జరిగాయని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రియాజ్ తెలిపారు. దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను వంచించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Riyaj Comments On Janardhan Reddy Resignation : రేవంత్ రెడ్డి టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని ప్రకటించిన తర్వాత నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి బాసటగా నిలిచారని రియాజ్ వివరించారు. కాంగ్రెస్ విజయం అంటే నిరుద్యోగుల విజయంగా భావించారని అన్నారు. టీఎస్‌పీఎస్సీకి పెద్ద అడ్డుగోడగా నిలిచిన జనార్దన్ రెడ్డి రాజీనామా చేయడంతో నిరుద్యోగుల్లో ఆనందం వెల్లివిరిసిందని తెలిపారు. భవిష్యత్తు అంతా నోటిఫికేషన్లు రావాలని ఆ నోటిఫికేషన్లు నిష్పక్షపాతంగా మెరిట్ ప్రకారం విద్యార్థులకు చేరాలని రియాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తు తెలంగాణ ఉద్యోగుల తెలంగాణగా మారాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.