వర్షాల్లో పనులు ఆపమని ఆదేశాలు.. పట్టించుకోని కాంట్రాక్టర్​.. కుప్పకూలిన బ్రిడ్జ్​ - ఛత్తీస్​గఢ్​ దుర్గ్​ జిల్లాలో కూలిన వంతెన

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 29, 2023, 7:44 AM IST

Under Construction Bridge Collapse : ఛత్తీస్​గఢ్​లోని దుర్గ్​ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కుప్పకూలి వరదలో కొట్టుకుపోయిది. బ్రిడ్జ్​ నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలను స్థానికులు తమ మొబైల్​ ఫోన్లలో బంధించారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్​గా మారింది. దీనిపై స్పందించిన అధికారులు.. వంతెన కాంట్రాక్టర్​కు షోకాజ్​ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు.   

ఇదీ జరిగింది.. ధమ్​ధా మండలంలోని సిల్లి, నన్​కట్టి గ్రామాలను కలిపేందుకు శివ్​నాథ్​​ నదిపై సాగ్ని ఘాట్ వద్ద ఓ వంతెన నిర్మిస్తున్నారు. పిల్లర్లపై స్టేజింగ్​, షట్టరింగ్​ పనులు పూర్తి చేశారు. ఈ క్రమంలో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మొగ్రా రిజర్వాయర్​ నిండగా.. శివ్​నాథ్​​ నదిలోకి నీటిని విడుదల చేశారు. దీంతో నీటిమట్టం పెరిగి వంతెన కుప్పకూలి వరదలో కొట్టుకుపోయింది. బ్రిడ్జ్​ కూలుతున్న దృశ్యాలను స్థానికులు తమ మొబైళ్లలో బంధించారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్​ కాగా.. అధికారులు స్పందించారు.  

'వర్షాలు కురుస్తుండటం వల్ల రోడ్లు, వంతెనల పనులు ఆపమని ఆదేశాలిచ్చాం. కానీ వంతెన కాంట్రాక్టర్​ పనులు కొనసాగించాడు. నీటి మట్టం పెరగడం వల్ల.. వంతెన కొట్టుకుపోయింది. దీనివల్ల రూ.12 లక్షల వరకు నష్టం వాటిల్లింది. దీనికి కాంట్రాక్టర్​​ నిర్లక్ష్యమే కారణం. వారికి షోకాజ్​ నోటీసులు జారీ చేయనున్నాం' అని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్​ డీకే మహేశ్వరి తెలిపారు. రూ. 16.40 కోట్ల అంచనా వ్యయంతో 2020లో ఈ వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు. నవంబర్​ 2022 నాటికే పనులు పూర్తి కావాల్సిన ఉంది. కానీ తాజా ఘటనతో బ్రిడ్జ్​ పనులు మరింత జాప్యం కానున్నాయి.  

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.