రాముడి కోసం సైకిళ్లపై 'అయోధ్య యాత్ర'- 25 రోజుల్లో 1600 కి.మీ ప్రయాణం!
🎬 Watch Now: Feature Video
Published : Dec 30, 2023, 8:13 PM IST
Two Youth Ayodhya Cycle Yatra : రామాలయ ప్రారంభోత్సవం నేపథ్యంలో అయోధ్యకు సైకిల్ యాత్ర చేపట్టారు మాహారాష్ట్రకు చెందిన ఇద్దరు యువకులు యశ్ యోలే, అంకేశ్ గుప్తా. జనవరి 22న జరగబోయే శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠలోపు అక్కడికి చేరుకునేటట్లు ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటివరకు 300 కిలో మీటర్లు యాత్ర పూర్తి చేశారు. మొత్తం 1,600 కిలో మీటర్ల ప్రయాణాన్ని 25 రోజుల్లో పూర్తి చేయాలని సంకల్పించుకున్నారు. అయితే ఈ సైకిల్ యాత్రలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సైకిల్ యాత్రలో భాగంగా దారిలో వచ్చే ఆలయాలను కూడా దర్శించుకుంటున్నారు ఈ యువకులు. ఇప్పటివరకు తాము జమ చేసుకున్న సేవింగ్స్‌తో పాల్ఘర్ నుంచి అయోధ్య వరకు సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టామని యశ్, అంకేశ్ తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రామమందిరం కల ఇప్పుడు నిజమైందని, దీంతో తమ ఆనందం రెట్టింపు అయిందని చెబుతున్నారు. అయితే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠకు ముందే అక్కడికి చేరుకుని మర్యాద పురుషోత్తముడి పాదాలకు నమస్కరించాలనుకుంటున్నట్లు తెలిపారు.
హిందుత్వం కోసం నిలబడటం, హిందూ మతాన్ని జాగృతం చేయడం కోసం ఈ యాత్ర చేపట్టామని యువకులు తెలిపారు. కుల, మత విభేదాలను తొలగించి, దేవుడు, మతం, దేశానికి ఎలా ప్రాధాన్యం ఇవ్వాలి అన్నదే ఈ యాత్ర ఉద్దేశం అని చెప్పారు. అయోధ్య యాత్ర కంటే ముందు సైకిల్‌పై పాల్ఘర్ నుంచి ద్వారక వరకు ప్రయాణించారు ఈ యువకులు. అయితే మొదటిసారి కాబట్టి ద్వారకకు చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టిందని తెలిపారు. ఈ యువకులు తమ ప్రయాణంలో పర్యావరణం, ఇతర విషయాలను అధ్యయనం చేయబోతున్నారు.