ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయానికి టీడీపీ మద్దతు కోరిన తుమ్మల నాగేశ్వరరావు - వాసిరెడ్డి రామనాథంను కలిసిన తుమ్మల

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Nov 5, 2023, 11:04 PM IST

Tummala Nageswararao Sought TDP Support : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు గడువు దగ్గర పడుతుండడంతో.. ప్రధాన పార్టీలు పొత్తులతో ముందుకు సాగుతున్నాయి. అధికార బీఆర్ఎస్​ను గద్దె దించేందుకు పదునైన వ్యూహాలు పన్నుతూ కాంగ్రెస్ పార్టీ మరింత జోరును కనపరుస్తుంది. ఈ క్రమంలోనే ఖమ్మం టీడీపీ నేతలు తనకు మద్దతు ఇవ్వాలని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆదివారం ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లిన తుమ్మలను.. ఆ పార్టీ నాయకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం టీడీపీ పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు వాసిరెడ్డి రామనాథంను తుమ్మల మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతూ.. కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యంగా వెళ్లాలని తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.

Telangana Elections 2023: ఈ ఎన్నికల్లో తెలంగాణలో హస్తం పార్టీ జయకేతనం ఎగురవేస్తుందని తుమ్మల నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఎమ్మెల్యేలను అదుపు చేసే శక్తి కూడా లేదని ఆరోపించారు. ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేసే ఆలోచన కూడా లేదని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కలిసి ప్రజలను దోచుకుంటున్నారని తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.