TSRTC Gamyam App : ఒక్క క్లిక్‌తో బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. ఎలాగో తెలుసా..? - టీఎస్ఆర్టీసీ ఇంచార్జ్తో ఇంటర్వ్యూ
🎬 Watch Now: Feature Video
Published : Sep 26, 2023, 2:16 PM IST
TSRTC Gamyam App : ఎక్కాల్సిన బస్సు ఎక్కడుందో...ఎప్పుడోస్తుందో ఇలాంటి సమాచారం తెలుసుకునేందుకు ఆర్టీసీ గమ్యం పేరుతో సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. అందులో పల్లె నుంచి పట్టణం వరకు తిరిగే ప్రతి ఆర్టీసీ బస్సుల వివరాలు, బస్సుల బ్రేక్ డౌన్లతో పాటు మహిళలకు మరింత సౌకర్యవంతంగా ఈ యాప్‌ను తీర్చిదిద్దింది. ఈ యాప్‌లోని ఒక్క క్లిక్‌తో బస్సు ఎక్కడున్నా వాటి కదలికలు కనుగొనవచ్చని ఆ సంస్థ పేర్కొంది.
మనకు కావాల్సిన వివరాలు యాప్‌లో నమోదు చేయగానే.. స్మార్ట్ ఫోన్‌లో స్క్రీన్‌పై ఆటోమేటిక్‌గా గ్రీన్ లైట్ కనిపిస్తుంది. ఆ లైట్‌ను డ్రైవర్ వైపునకు చూపిస్తే.. సంబంధిత డ్రైవర్ బస్సును ఆపుతారు. ఈ యాప్ ద్వారా మహిళలు సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ఆర్టీసీ గమ్యం యాప్‌కు విశేష స్పందన వస్తుందని ఆర్టీసీ ఐటీ చీఫ్ ఇంజినీర్ రాజశేఖర్ తెలిపారు. ఈ యాప్‌ను రోజుకు సగటున సుమారు 10వేల మంది యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటున్నారని వెల్లడించారు. ఆర్టీసీ బస్సు వివరాలతో పాటు, ప్రయాణికులకు అత్యవసరమైన సౌకర్యాలు తదితర వాటిని కూడా ఈ యాప్‌లో తెలుసుకునే వెసులుబాటు కల్పించామని చెప్పారు. ఈ నేపథ్యంలో గమ్యం యాప్‌నకు సంబంధించిన మరిన్ని వివరాలను ఆర్టీసీ ఐటీ చీఫ్ ఇంజినీర్ రాజశేఖర్ తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి..