మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో రఘునందన్‌కు చేదు అనుభవం.. - రఘునందన్ తాజా వీడియోలు
🎬 Watch Now: Feature Video
మునుగోడు నియోజకవర్గం సంస్థాన్ నారాయణపురం మండలంలోని లింగవారిగూడెంలో భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఎన్నికల ప్రచారం ఉద్రిక్తతకు దారి తీసింది. తెరాస నాయకులు ఆయన్ని అడ్డుకున్నారు. లింగవారిగూడెం.. తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి స్వగ్రామం. భాజపా అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి తరఫున ప్రచారానికి వచ్చిన రఘునందన్‌రావు అడ్డుకున్న గులాబీ శ్రేణులు మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో తెరాస నాయకులు, రఘునందన్‌రావు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భాజపా ప్రచారాన్ని అడ్డుకోవడానికి తెరాస నాయకులకు ఏం హక్కు ఉందని.. రఘునందన్‌రావు నిలదీశారు. రెండు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం తర్వాత రఘునందన్‌రావు లింగవారిగూడంలో కొంతసేపు ప్రచారం చేసి వెనుదిరిగారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST