Tribals Hit MRO In Mahabubabad : తహశీల్దార్‌పై గిరిజనుల దాడి.. అదే కారణమా? - మహబూబాబాద్ ఎంఆర్వోపై దాడి
🎬 Watch Now: Feature Video

Tribals Hit MRO In Mahabubabad : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో ప్రభుత్వ స్థలం సర్వే నంబర్ 551లో కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం కోసం భూసేకరణకు సర్వే, రెవెన్యూ అధికారులు వెళ్లారు. వారి భూసేకరణను గిరిజనులు అడ్డుకున్నారు. దీనితో గిరిజనులకు, రెవెన్యూ అధికారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వివాదం ఎక్కువగా ముదరకుండా అక్కడి నుంచి రెవెన్యూ అధికారులు వెనుదిరిగారు. అనంతరం మండల తహశీల్దార్ ఇమ్మాన్యుయల్పై గిరిజనులు దాడి చేశారు. ఆ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న వారు సెల్ఫోన్లలో రికార్డు చేశారు. వెంటనే ఎంఆర్వో పోలీసులకు ఫోన్ చేయడంతో.. అప్రమత్తమైన పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పోలీసుల రాకతో దాడి చేసిన వారు అక్కడి నుంచి పరారయ్యారు. తహశీల్దార్‌ను మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం కోర్టు కాంప్లెక్స్ నిర్మాణ స్థలాన్ని హైకోర్టు జడ్జి పరిశీలించారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని.. విచారణ చేపట్టారు.