అసెంబ్లీని ముట్టడించిన గిరిజనుల హక్కుల పోరాట సమితి సభ్యులు
🎬 Watch Now: Feature Video
Tribal Rights Members Protest at Assembly : ఈ నెల 9 నుంచి రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఇవాళ లంబాడీ, గిరిజనుల హక్కుల పోరాట సమితి సభ్యులు అసెంబ్లీని ముట్టడికి యత్నించారు. అసెంబ్లీ ఆవరణలోకి ఒక్కసారిగా నాయకులు పరిగెత్తుకుంటూ వచ్చి నిరసన తెలిపారు. సేవాలాల్ మహరాజ్ జయంతి(Sevalal Maharaj Jayanti) ఫిబ్రవరి 15వ తేదీ రోజు సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Lambadi Union Leaders Assembly Muttadi : కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలోని మంత్రి వర్గంలో గిరిజనులకు అవకాశం కల్పించాలని గిరిజన హక్కుల పోరాట సమితి సభ్యులు డిమాండ్ చేశారు. అసెంబ్లీ దగ్గర భారీ బందోబస్తుతో ఉన్న పోలీసులు నిరసన తెలిపేందుకు వస్తున్న వారిని చూసి అప్రమత్తమయ్యారు. వారిని వెంటనే నిలవరించి అదుపులోకి తీసుకున్నారు. ముట్టడికి వచ్చిన సంఘం నేతలను పోలీసులు అరెస్టు(Police Arrest Lambadi Union Leaders) చేశారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వెళ్లారు.