Police Attack on Driver : డీసీఎం డ్రైవర్‌పై ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం.. గాయాలపాలైన బాధితుడు - DCM driver attacked by traffic police

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 13, 2023, 10:44 PM IST

Police Attack on Driver Viral video : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఓ డీసీఎం డ్రైవర్‌పై ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ పేరుతో అతడిని తీవ్రంగా కొట్టారు. దీంతో బాధితుడు గాయాలపాలయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సైదులు అనే వ్యక్తి.. డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం పనులు ముగించుకొని బైక్‌పై ఇంటికి వెలుతుండగా.. ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌ పేరుతో  సదరు వాహనాన్ని ఆపారు.

ఈ నేపథ్యంలోనే సైదులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షకు సహకరిస్తానని చెప్పినా వినకుండా.. పోలీసులు అతని వాహనం తాళం చెవిని లాక్కున్నారు. దీంతో బాధితుడు ఇదేంటని వారిని ప్రశ్నించాడు. దీంతో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ లాఠీతో సైదులును చితకబాదాడు. ఈ ఘటనలో అతని మూడు వేళ్లు, మణికట్టు విరిగిపోయింది. దీంతో వెంటనే పోలీసులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఈ విషయం తెలుసుకున్న డ్రైవర్ల యూనియన్ బాధితుడితో కలిసి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఈ రోజు ధర్నా నిర్వహించారు. డ్రైవర్‌పై దాడి చేసిన.. సదరు ట్రాఫిక్ పోలీసుపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.