Traffic CI attack: వాహనదారుడిపై చేయి చేసుకున్న ట్రాఫిక్ సీఐ.. దుర్భాషలాడుతూ.. - kphb Traffic CI attack video
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16010298-193-16010298-1659587760184.jpg)
Traffic CI attack on motorist: ద్విచక్ర వాహనదారుడిపై ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చేయి చేసుకున్న ఘటన హైదరాబాద్ కేపీహెచ్బీలో చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓం ప్రకాశ్‌రెడ్డి అనే వ్యక్తిని కైత్లాపూర్ వద్ద ట్రాఫిక్ పోలీసులు ఆపారు. వాహనంపై పెండింగ్ చలాన్లు ఉన్నాయని.. వెంటనే చెల్లించాలన్నారు. ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని.. అత్యవసర పని మీద వెళ్తున్నానని మరుసటి రోజు డబ్బులు చెల్లిస్తానని ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. దీంతో ఆగ్రహించిన ట్రాఫిక్ సీఐ.. సదరు వాహనదారుడిని దుర్భాషలాడుతూ చేయిచేసుకున్నాడు. ఈ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST