Prathidwani : ఎన్నికల అఫిడవిట్లు.. అభ్యర్థులపై వేట్లు - Minister Srinivas Goud

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 26, 2023, 10:07 PM IST

Prathidwani : ‘‘ప్రజాస్వామ్యం.. రాజ్యాంగ ముఖ్య లక్షణం. ఓటు హక్కుకు పూర్తి చట్టబద్ధత ఉంది. ప్రతి ఓటరుకూ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పూర్తి నేపథ్యం తెలుసుకొనే హక్కు ఉంటుంది’’ అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. తన ఎన్నికను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించాలని కోరుతూ.. అపీల్​ చేసిన మెదక్​ ఎంపీ బీబీ పాటీల్​, మంత్రి శ్రీనివాస్​గౌడ్​ పిటిషన్​లను సుప్రీంకోర్టు, హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ఘటనలు నేతలను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఎన్నికల అఫిడవిట్లు పిడుగుపాట్లుగా మారాయి. ఎన్నికల అఫిడవిట్లలో సరైన సమాచారం చెప్పకపోతే అసలుకే మోసం వస్తోంది. కొత్తగూడెం ఎమ్మెల్యే ఎంపిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తరహా కేసులున్న ప్రజాప్రతినిధుల్లో టెన్షన్ మొదలైంది. ఎన్నికల కమీషన్​ నిబంధనల్ని అభ్యర్థులంతా పాటిస్తున్నారా? అన్న సందేహం తలెత్తుతోంది. లోపం ఎన్నికల సంఘానిదా? రాజకీయ పార్టీలదా?. రాష్ట్ర హైకోర్టులో మరో 28 మంది ప్రజాప్రతినిధుల కేసులు పెండింగ్​లో ఉన్నాయి. ఏ ఏ పరిస్థితుల్లో కోర్టులు అటువంటి తీర్పునిస్తాయి.. ఈ అంశంపై నేటి ప్రతిధ్వని

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.