Tiranga Decoration in Edupayala Temple : 'త్రివర్ణ' రూపంలో ఏడుపాయల దుర్గమ్మ దర్శనం.. భక్తుల పరవశం - స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు 2023
🎬 Watch Now: Feature Video
Tiranga Decoration in Edupayala Temple : రాష్ట్రంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ వినూత్నంగా తమ దేశభక్తిని చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మెదక్ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గా భవాని అమ్మవారిని త్రివర్ణ శోభితంగా విశేషాలంకారణ చేశారు. అలంకరణను చూడటానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఆలయ అర్చకులు తెల్లవారుజామునే మూల విరాట్‌కు సహస్ర నామార్చన, కుంకుమార్చన చేశారు. అమ్మవారికి అభిషేకం చేసి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ భక్తిని ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలన్న ఉద్దేశంతో అమ్మవారికి ఈ విశేష అలంకరణ చేసినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ మన భారత దేశ చరిత్ర, స్వాంత్రంత్య్రాన్ని మనం ఎలా పొందామో అన్నది తెలుసుకోవాలన్నారు. ఇదిలా ఉండగా.. భక్తులు మంజీరా స్నానం ఆచరించి త్రివర్ణ శోభితమై ఉన్న అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. గుడి అలంకరణ చూసి భక్తులు ఆనందిస్తున్నారు.