కరెంట్ షాక్కు మూడు ఏనుగులు బలి.. అంత్యక్రియలు చేసిన గ్రామస్థులు - కాఫీ తోటలో మృతి చెందిన ఏనుగులు
🎬 Watch Now: Feature Video
Three Elephants Died Electrocution In Assam : అసోంలోని గువాహటిలో విషాదం నెలకొంది. టీ తోటలోకి వెళ్లిన మూడు ఏనుగులు కరెంట్ షాక్తో మరణించాయి. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఏనుగుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వాటికి అంత్యక్రియలు నిర్వహించారు.
అసలేం జరిగిందంటే.. గువాహటి.. అటవీ ప్రాంతంలో ఓ కాఫీ తోటలోకి గురువారం రాత్రి మూడు ఏనుగులు ప్రవేశించాయి. ఆ తోటలో విధ్వంసం సృష్టించాయి. ఈ క్రమంలో కరెంట్ తీగ తెగి కొబ్బరి చెట్టుపై పడింది. దీంతో అక్కడే ఉన్న మూడు ఏనుగులు మరణించాయి. ఏనుగుల మృతి సమాచారం అందుకున్న అటవీ అధికారులు.. గ్రామస్థుల సాయంతో వాటికి పూడ్చిపెట్టారు.
గర్భంతో ఉన్న ఏనుగు హత్య..
ఈ ఏడాది మేలో 10 నెలల గర్భంతో ఉన్న ఏనుగును తుపాకీతో కాల్చి చంపిన ఘటన కర్ణాటక కొడగు జిల్లాలో జరిగింది. ఆహార అన్వేషణలో భాగంగా అడవి నుంచి వచ్చిన 20 ఏళ్ల ఏనుగును రసూల్‌పుర్, బాలుగోడు ప్రాంతంలో ఆగంతకులు కాల్చి చంపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఏనుగు మృతి చెందిన ప్రాంతాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిర్వహించిన పశువైద్యులు మృతి చెందిన ఏనుగు కడుపులో మగ పిండం ఉన్నట్లు తెలిపారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.