Thieves Robbery In House Sangareddy : దొంగతనానికి వచ్చి.. ఫోన్ ఛార్జింగ్ పెట్టాడు.. అంతలోనే! - Gold theft in Sangareddy
🎬 Watch Now: Feature Video
Thieves Came To Steal House In Sangareddy : దొంగతనానికి వచ్చిన వ్యక్తి తన పని తాను చేసుకు పోకుండా.. ఫోన్‌లో ఛార్జింగ్ లేదని ఛార్జింగ్ పెట్టాడు. ఆ తర్వాత తన పనిలో నిమగ్నమై సొత్తును దోచుకునే పనిలో పడ్డాడు. ఇంతలోనే ఇంటి యజమాని రావడంతో ఫోన్‌ను మరచిపోయి.. అక్కడ నుంచి పరారయ్యాడు. ఇదేదో సినిమాల్లో జరిగిన సన్నివేశం అనుకుంటే పప్పులో కాలేసినట్లే. నిజజీవితంలో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువు ప్రాంతంలో చోటుచేసుకుంది. వెంటనే బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువు ప్రాంతంలో సాయిరాం కాలనీలో కమాలుద్దీన్ నివాసం ఉంటున్నారు. అయితే ఇంట్లో యజమాని కుటుంబ సభ్యులు లేని సమయం చూసి.. ఇద్దరు దొంగలు ఇంట్లోకి చోరబడ్డారు. సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టుకొని మరీ.. నిర్మలంగా సొత్తును దొంగలిస్తున్నారు. ఇలా 12 తలాల బంగారం, 69 తులాల వెండి, రూ.24 వేల నగదు దోచుకున్నారు. ఈలోపు ఇంటి యజమాని వచ్చేసరికి.. భయభ్రాంతులై అక్కడ నుంచి పరారయ్యారు. బాధితుడు దొంగల్ని పట్టుకునేందుకు ప్రయత్నించినా.. దొరక్కుండా సెల్‌ఫోన్‌ను వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే బాధితుడు పటాన్‌చెరువు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు క్లూస్ టీంను రప్పించి.. ఫోన్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.