100 కిలోల బంగారం, వెండి నగలు చోరీ.. షట్టర్ ధ్వంసం చేసి మరీ.. - రాజస్థాన్ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
రాజస్థాన్ బారా జిల్లాలో దోపీడీ దొంగలు బీభత్సం సృష్టించారు. శనివారం అర్ధరాత్రి ఓ బంగారు దుకాణంలోకి చొరబడి సుమారు 100 కిలోల పసిడి, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. వీటి విలువ రూ.కోటి ఉంటుందని యజమాని తెలిపారు. ఛీపాబడౌద్ ప్రధాన మార్కెట్ సమీపంలోని ఓ నగల దుకాణం షట్టర్ ధ్వంసం చేశారు దోపిడీ దొంగలు. ఆ శబ్దాలు విన్న యజమాని దుకాణానికి వెళ్లేసరికి దొంగలు అతడిపైనా దాడి చేశారు. వెంటనే ఇంట్లోకి వెళ్లి లైసెన్స్డ్ తుపాకీ తీసుకువచ్చి దొంగలపైకి కాల్పులు జరిపాడు. దీంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. సుమారు 8 మంది దొంగలు రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడ్డాడని ఎస్పీ కల్యాణ్ తెలిపారు. చోరీ అనంతరం దొంగలు వ్యాన్లో పారిపోయారని చెప్పారు.