Fish theft in Suryapet : లాఠీ ఝళిపించిన ఆగని చేపల లూటీ - fish chori in village
🎬 Watch Now: Feature Video
Fish theft in Suryapet : జనం తలచుకుంటే ఎవరు అడ్డొచ్చిన వారిని ఆపలేరని మరోసారి నిరూపితమైంది. చేపలను పెంచడానికి గ్రామ చెరువును లీజుకు తీసుకున్న కాంట్రాక్టర్.. గ్రామస్థులు చేపలను లూటీ చేస్తారేమోనన్న భయంతో ముందుజాగ్రత్తగా పోలీసులను చేపలు పట్టే ప్రాంతానికి పిలిపించుకున్నాడు. కానీ చివరకు తాను ఊహించిందే జరిగింది. తమ గ్రామ చెరువులో పట్టిన చేపలను తమకు ఆమ్మడంలేదని ఆగ్రహించిన గ్రామస్థులు.. పోలీసుల ముందే అందినకాడికి లూటీ చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రాయినిగూడెం గ్రామంలో ఈ చోటుచేసుకుంది. స్థానిక రాయినిగూడెం గ్రామ చెరువును లీజుకు తీసుకున్న సంబంధిత కాంట్రాక్టర్.. పట్టిన చేపలను ఎవరూ ఎత్తుకెళ్లకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాడు.
చేపలు పట్టడం అయిపోయిన తర్వాత.. తమ గ్రామ చెరువులోని చేపలను తమకు విక్రయించరని తెలుసుకున్న గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా ఊరి జనమంతా చేపలు కాంటా వేసే ప్రాంతానికి చేరుకొని అందిన కాడికి చేపలను ఎత్తుకెళ్లారు. పోలీసులు పహారా ఉన్నప్పటికి చేపలు చూస్తుండగానే ఫలహరం అయ్యాయి. చేపలను ఎత్తుకెళ్లే గ్రామస్థులను కట్టడి చేసేందుకు పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జ్ చేశారు. అయినప్పటికీ చేపల లూటీ మాత్రం ఆగలేదు. దీంతో కాంట్రాక్టర్ తనకు భారీ నష్టం వచ్చిందని వాపోయాడు.