Ice Cream Tasting Challenge in Hyderabad : ఈనెల 18న హైదరాబాద్లో ఐస్క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్ - telangana latest news
🎬 Watch Now: Feature Video
Ice Cream Tasting Challenge in Hyderabad : 'ది గ్రేట్ ఇండియన్ ఐస్క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్-2023' హైదరాబాద్ వాసులను అలరించనుంది. ఈ నెల 18న హైటెక్ సిటీలోని మైదాన్ ఎక్స్ పో సెంటర్ వేదికగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు విజయ డెయిరీ ఛైర్మన్ సోమ భరత్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు నగరంలోని ఓ ప్రైవేటు హోటల్ లో నిర్వహించిన సమావేశంలో కొర్రమీను సినిమా నటి కిశోరి, హైబిజ్ టీవీ వ్యవస్థాపకులు రాజగోపాల్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. త్వరలో విజయ డెయిరీ తరఫున కొత్తగా ఐస్ క్రీమ్లను అందుబాటులోకి తేనున్నట్లు సోమ భరత్ తెలిపారు. గ్రేట్ ఇండియన్ ఐస్క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్లో భాగంగా కళ్లకు గంతలు కట్టుకుని ఎక్కువ సంఖ్యలో ఐస్ క్రీమ్ ఫ్లేవర్లను గుర్తించిన వారికి నగదు బహుమతులు అందించనున్నట్టు వివరించారు. బుక్ మై షో, మేరా ఈవెంట్స్, పేటీఎం ఇన్ సైడర్ ద్వారా ఈ పోటీల టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చని భరత్ వెల్లడించారు.