Talasani Holi celebrations: మనువడితో తలసాని హోలీ సంబురం - Holi celebrations in Hyderabad
🎬 Watch Now: Feature Video
Thalasani Srinivasyadav celebrated Holi festival: హోలీ పండగ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహంలో మునిగిపోతారు. చిన్నాపెద్దా తేడా తెలియకుండా రంగులను చల్లుకుంటారు. రంగులమయంతో ప్రతి ఊరూ-వాడా కళకళలాడిపోతుంది. రాష్ట్రవ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి.హోలీ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన మనువడు తారక్‌తో హోలీ ఆడుతూ సందడిగా గడిపారు.
వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఆయన నివాసంలో తాత మనువడు ఇద్దరు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటు హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఎప్పుడు ప్రజా జీవితంలో బిజీగా ఉండే మంత్రి హొలీ సందర్భంగా మనవడితో ఎంతో సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సంస్కృతి, సంప్రదాయాలు, ధార్మిక సిద్ధాంతాలకు ప్రతీకగా నిలిచే పండుగలను విశ్వవ్యాప్తం చేయాలని తలసాని కోరారు.
ఇవీ చదవండి: