Temple Theft Hyderabad : రెయిన్‌కోట్ వేసుకొని అమ్మవారి గుడిలో హుండీ చోరీ - తెలంగాణ న్యూస్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-07-2023/640-480-19089868-552-19089868-1690266934464.jpg)
Attapur Temple theft case : హైదరాబాద్ నగరంలో రోజురోజుకు దొంగతనాలు, దోపిడీలు ఎక్కువవుతున్నాయి. ఇన్ని రోజులు ఇళ్లను దోచుకున్న దుండగులు ఇప్పుడు అమ్మవారి గుళ్లపై కన్నేశారు. ఇటీవలే బోనాల పండుగ జరుపుకోవడంతో అమ్మవారి హుండీలు భక్తుల కానుకలతో నిండిపోయాయి. ఇదే అదనుగా భావించిన దొంగలు పలు ఆలయాల్లో హుండీలు చోరీ చేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి రాజేంద్రనగర్ సర్కిల్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆలయంలో చొరబడ్డాడు. అత్తాపూర్ గ్రామంలోని పోచమ్మ దేవాలయంలోని అమ్మవారి హుండీని ఎత్తుకెళ్లాడు. దొంగలు అమ్మవారి గుడిలో నుంచి హుండీని ఎత్తుకెళ్లే దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఉదయాన్నే గుడికి వచ్చిన ఆలయ కమిటీ సభ్యులు జరిగిన విషయాన్ని గమనించి అత్తాపూర్ పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనాస్థలికి చేరుకున్న అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. రంగంలోకి దిగిన క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. వీలైనంత త్వరగా సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తిస్తామని పోలీసులు తెలిపారు.