Temperatures Hike in Telangana : రాష్ట్రంలో మండుతున్న ఎండలు.. బెంబేలెత్తుతున్న ప్రజలు - హైదరాబాద్ న్యూస్
🎬 Watch Now: Feature Video

High temperatures in Telangana : రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతన్నాయి. భానుడి సెగలకు జనం అల్లాడిపోతున్నారు. హైదరాబాద్ జంట నగరాల్లోని రోడ్లు నిర్మానుషంగా కనిపిస్తున్నాయి. రోజురోజుకు ఎండ తీవ్రత భారీగా పెరగడంతో భయటకు రావాలంటనే ప్రజలు హడలిపోతున్నారు. ఇక మిట్ట మధ్యాహ్నం ఎండలు మరింత మండిపోతున్నాయి. నిప్పుల కొలిమిలో ఉన్నట్లుగా తయారవుతోంది హైదరాబాద్ రోడ్ల పరిస్థితి. మధ్యహ్నం 1 నుంచి 3 గంటల సమయంలో గ్రేటర్లోని ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్లు ప్రయాణికులు లేక నిర్మానుషంగా మారాయి. ఎల్బీనగర్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, హైటెక్ సిటీ, మదాపూర్, బేగంపేట్, సికింద్రాబాద్, తార్నాక ఇలా అన్ని ఫ్లై ఓవర్లు, రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర, ఈశాన్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లో 40కి పైగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుంటే మిగతా జిల్లాల్లో సాధారణం కన్నా ఒకటి నుంచి రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నట్లు హైదారాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నాగరత్న తెలిపారు. ఈ నెల 19 నుంచి వేడి వాతావరణంతో పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతాయంటున్న నాగరత్నతో ఈటీవీ భారత్ ముఖాముఖి.