TS POLYCET 2023 RESULTS : తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా - పాలిసెట్ ఫలితాలు 2023 విడుదల
🎬 Watch Now: Feature Video
TS POLYCET 2023 RESULTS : రాష్ట్రంలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన ‘పాలిసెట్-2023’ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో 82.75 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ప్రకటించారు. ఈ మేరకు 80 వేల 752 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ఆయన వెల్లడించారు.
పాలిసెట్-2023 నోటిఫికేషన్ జనవరి నెలలో విడుదల కాగా.. అదే నెల 16 నుంచి ఏప్రిల్ 24 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మే 17న పరీక్షను నిర్వహించగా.. మొత్తం లక్షా 5 వేల 742 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 98 వేల 273 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు వ్యవసాయ, ఉద్యాన వన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం ఈ పరీక్ష నిర్వహించారు.