New Secretariat: సాగర తీరాన ఉట్టిపడుతున్న రాజసం... ఇదిగో... తెలంగాణ ప్రజాసౌధం - తెలంగాణ నూతన సచివాలయం విజువల్స్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18379025-680-18379025-1682769031738.jpg)
Telangana New Secretariat Video: చార్మినార్.. గోల్కొండ కోట.. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం.. కొత్తగా అధునాతన పాలనా సౌధం. తెలంగాణ ఖ్యాతిని, భాగ్యనగర విఖ్యాతిని నలుదిశలా చాటేలా.. తెలంగాణ సచివాలయం కార్యరూపం దాల్చింది. అభివృద్ధిలో, విస్తరణలో శరవేగంగా దూసుకుపోతున్న మహానగరానికి తలమానికమంటే సరిపోదు.. అంతకుమించి నాలుగు కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల పాలనకు ఇది హృదయస్థానం. కలలుగన్న, నవ్య పాలనా ప్రాసాదం ప్రారంభానికి సిద్ధమైంది. బయటి నుంచి చూపరుల కళ్లను ఎంతలా కట్టి పడేస్తుందో.. లోపలికెళితే అత్యాధునిక సౌకర్యాలూ అంతే అబ్బురపరుస్తాయి.
భిన్న సంస్కృతులను ప్రతిబింబించే నిర్మాణ శైలుల సమ్మేళనం. సంప్రదాయ, ఆధునిక సౌందర్యాల కలబోత. కాకతీయ కళాఖండాలు, వనపర్తి సంస్థానాధీశుల ప్రాసాదాలు, రాజస్థానీ రాతి, గుజరాతీ రీతులతో కట్టబడిన కలల సౌధం. తెలంగాణ సంస్కృతి, జీవనస్థితులను అడుగడుగునా నింపుకుని... తాత్వికత, మార్మికత నిబిడీకృతమై దేదీప్యమానంగా ఆవిష్కృతమైందో.... అద్భుత కట్టడం. ప్రాచీనయుగం నాటి ఆలయ గోపురాలు, మధ్యయుగం నాటి రాజభవనాలను ప్రతిబింబిస్తూ... భాగ్యనగర సాగర తీరాన ఠీవీగా నిలిచింది.... ఈ అధునాతన పాలనాసౌధం. సీఎం కేసీఆర్ కార్యదక్షతతో.... 4కోట్ల మంది ఖ్యాతిని నలుదిశలా చాటిచెప్పేలా రూపుదిద్దుకున్న తెలంగాణ ప్రజాసౌధం నిర్మాణం తీరు, అందులోని విశేషాలు ఇప్పుడు చూద్దాం.