Telangana ICET 2023 Results : ఐసెట్‌లో మెరిసిన అబ్బాయిలు.. మొదటి పది ర్యాంకులు కైవసం
🎬 Watch Now: Feature Video
Telangana ICET 2023 Results Released: తెలంగాణ ఐసెట్ 2023 ప్రవేశా పరీక్షా ఫలితాల్లో అబ్బాయిలు సత్తా చాటారు. మొదటి పది ర్యాంకులూ వారే కైవసం చేసుకున్నారు. సూర్యాపేటకు చెందిన నూకల శరణ్ కుమార్ మొదటి ర్యాంకు రాగా.. హైదరాబాద్‌కు చెందిన సాయి నవీన్, రవితేజలు రెండు మూడు ర్యాంకుల్లో నిలిచారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి గాను మే 26, 27 తేదీల్లో కేయూ ఆధ్వర్యంలో ఐసెట్ నిర్వహించగా పరీక్ష ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొ.లింబాద్రి ఇవాళ విడుదల చేశారు. అబ్బాయిలు 86.11 శాతం, అమ్మాయిలు 86.22 శాతం ఉత్తీర్ణత సాధించారు. విజయవంతంగా పరీక్ష నిర్వహించిన కాకతీయ వర్శిటీ ఆధ్యాపకులను ప్రొ. లింబాద్రి అభినందించారు. కౌన్సెలింగ్ తేదీల షెడ్యూల్ వచ్చే నెల మొదటి వారంలో ప్రకటిస్తామని ప్రకటించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఉన్నత విద్య మెరుగైన ప్రమాణాలతో ప్రగతి సాధిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ఎంబీఏ, ఎంసీఏ విద్యార్ధుల కోసం 318 కళాశాలలు 36వేల 900 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేయూ ఉపకులపతి తాటికొండ రమేష్, ఐసెట్ కన్వీనర్ వరలక్ష్మి, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.