Telangana CEO Vikasraj Interview : 'ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్న ఓట్లు తొలగిస్తాం' - Assembly Polls
🎬 Watch Now: Feature Video
Published : Aug 30, 2023, 1:00 PM IST
Telangana CEO Vikasraj Interview : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. ఎన్నికల ఏర్పాట్లలో ప్రస్తుతం బిజీబిజీగా ఉంది. ఈ సంవత్సరం ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. ఎవరికీ ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్(State Chief Election Officer Vikasraj) తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి 21 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. ముసాయిదా జాబితాలను అందరూ అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.
CEO on Telangana Assembly Elections 2023 : ఓటర్లు తమ పేర్లను జాబితాలో సరిచూసుకోవడంతో పాటు మార్పులు, చేర్పులు అవసరమైతే దరఖాస్తులు తీసుకోవాలని చెప్పారు. జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో సమావేశమైన సీఈఓ వికాస్‌రాజ్.. ఓటర్ల జాబితా(Telangana Voters List) పై వచ్చిన అభ్యంతరాలు, వినతులపై సమీక్ష నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి పూర్తి స్థాయిలో పరిశీలించాకే వాటిని పరిష్కరించాలని ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించారు. ఓటరు జాబితాలో పేర్ల చేర్పు, తొలగింపు విషయాల్లో ఈఆర్ఓలు న్యాయపరమైన, ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. సీఈఓ వికాస్‌రాజ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.