తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం - తెలంగాణ అయ్యప్ప భక్తులు దుర్మరణం - Mulugu Ayyappa Devotees Died in Accident

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Dec 17, 2023, 7:56 PM IST

Telangana Ayyappa Devotees Died in Road Accident Tamil Nadu : తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందారు. వీరంతా ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామస్థులు. ఈ నెల 14న ములుగు నుంచి బయలుదేరి శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. మధ్యాహ్నం తమిళనాడులోని తేని జిల్లా దేవదాన పట్టి బైపాస్ రోడ్డుకు చేరుకుంది.

ఈ క్రమంలోనే వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు అయ్యప్ప భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందగానే తమిళనాడు పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనతో ములుగు జిల్లా కమలాపురంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.