Telangana Assembly Sessions 2023 : ఆగస్టు రెండోవారంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..! - Telangana latest politics
🎬 Watch Now: Feature Video
Telangana assembly meetings in August : రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు రెండో వారంలో జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 12తో ముగిశాయి. 6నెలల గడువు ప్రకారం ఆగస్టు 11లోపు ఉభయసభలు తిరిగి సమావేశం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల రెండో వారంలో అసెంబ్లీ, కౌన్సిల్‌ను సమావేశ పరుస్తారని సమాచారం. వివిధ అంశాలు, రాష్ట్రంలో పరిస్థితులు సమావేశాల్లో చర్చకు రానున్నాయి. కొన్ని బిల్లులను బీఆర్ఎస్ సర్కార్ తీసుకొచ్చే అవకాశం ఉంది. నవంబర్ లేదా డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నికలకు ముందు ఈ సమావేశాలే చివరి సమావేశాలు అయ్యే అవకాశం ఉంది. సహజంగానే ఎన్నికల ప్రభావం సమావేశాలపై ఉండనుంది. సమావేశాల కంటే ముందు రాష్ట్ర మంత్రి వర్గం భేటీ అయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల తేదీ ఖరారు సహా పలు అంశాలపై కేబినెట్లో చర్చించనున్నారు.