Police Gave Clarity On Traffic Challan Discount Claims : పెండింగ్‌లో ట్రాఫిక్ చలానాలను డిస్కౌంట్ మళ్లీ వచ్చిందంటూ వస్తున్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో డిస్కౌంట్ ఇచ్చిన విధంగానే మళ్లీ ఆఫర్ ఇచ్చినట్లు వార్త సర్క్యూలేట్ అవుతోంది. ఇందులో కార్లపై 60శాతం వరకు, ద్విచక్ర వాహనాలపై 60 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లుగా ఉంది. ఇవాళ్టి నుంచి వచ్చే నెల 10 వరకు ఆఫర్ ఉందని అందులో ఉంది. చాలామంది తమకొచ్చిన మెసేజ్‌లు చూసి ఈ న్యూస్ నిజమేనని నమ్మారు కూడా.
పెండింగ్ ట్రాఫిక్ చలానాలపై ఎలాంటి రాయితీ లేదు : అయితే ట్రాఫిక్ విభాగం ఈ మెసేజ్‌లపై స్పందించింది. తాము ఎలాంటి రాయితీ ప్రకటించలేదని స్పష్టం చేసింది. పెండింగ్ ట్రాఫిక్ చలానాలపై ఎలాంటి రాయితీ ఇవ్వలేదని, వాహనదారులు ఎవరూ నమ్మవద్దని ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఈ తరహా తప్పుడు ప్రచారాలు చేసిన వారి పై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. డిసౌంట్లకు సంబంధించి అధికారిక సమాచారాన్ని ట్రాఫిక్ విభాగం నిర్వహిస్తున్న echallan.tspolice.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే తెలుసుకునే వీలుంటుందన్నారు. ఎవరికైనా అనుమానాలుంటే హెల్ప్‌లైన్ నెంబర్లు 040 27852772, 27852721 కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని విశ్వప్రసాద్ తెలిపారు.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గత ఏడాది డిసెంబర్లో రాయితీ ఆఫర్ ఇచ్చారు. డిసెంబర్ 2023లో ప్రకటించిన ఆఫర్ ఈ ఏడాది ఫిబ్రవరి 15న ముగిసింది. అంతకుముందు 2022లో కూడా ఇలా ఆఫర్ ఇచ్చారు.
వాహనదారులకు శుభవార్త - పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు పెంపు
పెండింగ్ చలాన్ల చెల్లింపులకు విశేష స్పందన - హ్యాంగైన సర్వర్