కూకట్‌పల్లిలో పిక్సెల్ కంటి ఆసుపత్రిని ప్రారంభించిన తనికెళ్ల భరణి
🎬 Watch Now: Feature Video
Published : Dec 18, 2023, 7:22 PM IST
|Updated : Dec 18, 2023, 10:56 PM IST
Tanikella Bharani at Pixel Eye Hospital Opening : కన్నులు లేకుంటే కలియుగమే లేదని ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి అన్నారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన పిక్సెల్ కంటి ఆసుపత్రి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పిక్సెల్ కంటి ఆసుపత్రి ఎండీ డాక్టర్ కృష్ణ పూజిత, డాక్టర్ అబ్దుల్ రషీద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను తనికెళ్ల భరణి పరిశీలించారు. కంటి జబ్బులు తగ్గాలని, మంచి వైద్యం అందించాలని ఆయన ఆకాంక్షించారు.
డాక్టర్‌కు, రోగి మధ్య మానవ సంబంధాలు ఉండాలని తనికెళ్ల భరణి తెలిపారు. కేవలం డబ్బు కోసం కాకుండా ప్రజలకు సేవ చేసేందుకు ఆసుపత్రి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గత పదేళ్లుగా వివిధ సంస్థలో పని చేయడమే కాకుండా, అనేక పరిశోధనలు చేసి ఈ ఆసుపత్రిని ప్రారంభించామని పిక్సెల్ కంటి ఆసుపత్రి ఎండీ డాక్టర్ కృష్ణ పూజిత అన్నారు. అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాలైన సేవలను అందిస్తున్నట్లు ఆమె వివరించారు.