Talasani on Mega Dairy in Raviryal : రావిర్యాల మెగా డెయిరీతో యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు - తెలంగాణ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Published : Oct 5, 2023, 9:32 AM IST
|Updated : Oct 5, 2023, 11:39 AM IST
Minister Talasani on Mega Dairy in Raviriyala : పాడి రంగంలో మెగా ప్రాజెక్టు.. ర్యావిరాల విజయ డెయిరీ ఇవాళ ప్రారంభం కానుందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ప్రపంచ స్థాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హైదరాబాద్ శివారు రావిర్యాల వద్ద 40 ఎకరాల విస్తీర్ణంలో 250 కోట్ల రూపాయల వ్యయంతో మెగా డెయిరీ ప్లాంట్‌ను నిర్మించామని తెలిపారు. దీనిని మంత్రి కేటీఆర్ ఈ రోజు మధ్యాహ్నం ప్రారంభించనున్నారని చెప్పారు. ఈ భారత్‌లో నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ ఎన్‌డీడీబీ ఆర్థిక సహకారం మేరకు తొలి పూర్తి స్థాయి ఆటోమేషన్ టెక్నాలజీ సాయంతో రోజుకు 8 లక్షల లీటర్ల శుద్ధి చేసే సామర్థ్యం ఉందని వివరించారు. ఈ మెగా డెయిరీ ద్వారా యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలతో పాటు పాడి రైతులకు మేలైన ఆదాయ మార్గాలు చూపాలన్నది కేసీఆర్ సర్కారు లక్ష్యం అని మంత్రి తలసాని ప్రకటించారు. ఈ మెగా డెయిరీ నిర్వహణ కోసం సౌరశక్తి ఉత్పత్తి వ్యవస్థసహా వ్యర్ధాల వినియోగం ద్వారా విద్యుదుత్పత్తి చేసేలా ఏర్పాట్లు చేయడం ప్రత్యేకతంటున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి..