ప్రజాభవన్‌కు పాదయాత్రగా బయలుదేరిన జహీరాబాద్ చెరుకు రైతులు
🎬 Watch Now: Feature Video
Sugarcane Farmers March To Meet CM Revanth : చెరుకు రైతు సమస్యలను సీఎం రేవంత్ రెడ్డికి వివరించేందుకు జహీరాబాద్ చెరుకు రైతులు ప్రజాభవన్‌కు పాదయాత్రగా బయలుదేరారు. జహీరాబాద్ మండలం బూర్థిపాడు గ్రామానికి చెందిన యువరైతు మహేష్ తోటి రైతులతో కలిసి హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌కు పాదయాత్రగా చేపట్టారు. కొత్తూరులోని ట్రైడెంట్ చెక్కర కర్మాగారం ఈ సంవత్సరం తెరవక పోవడంతో జహీరాబాద్ ప్రాంత చెరుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని మహేష్ తెలిపారు.
Zaheerabad Farmers March To Prajabhavan : టన్ను చెరుకు అమ్మితే నాలుగు వందల రూపాయల వరకు నష్టపోతున్నామని ఇలా ఒక రైతు 40 నుంచి 50 వేల వరకు ఆదాయం కోల్పోతున్నామని వాపోయారు. రైతు ప్రభుత్వంగా చెప్పుకునే కాంగ్రెస్ అధికారంలోకి రావడం సంతోషమని చక్కెర కర్మాగారాన్ని పునప్రారంభించేందుకు సీఎం చొరవ చూపాలని కోరుతూ వినతి పత్రం సమర్పిస్తామని తెలిపారు. రైతు మహేష్ పాదయాత్రకు చెరుకు రైతులతో పాటు వివిధ రాజకీయ పార్టీలు, రైతు సంఘాల నాయకులు హాజరై మద్దతు పలికారు.