ఓటు హక్కు వినియోగంపై యువత ఏమంటోంది? - విద్యార్థుల ఎవరికి ఓటు వేస్తారు
🎬 Watch Now: Feature Video
Published : Nov 28, 2023, 7:25 PM IST
Students Opinion on Telangana Elections : ఎన్నికల వేళ పంచే డబ్బుకు, మద్యానికి ఆశపడి ఓటేస్తే ఐదేళ్ల అభివృద్ధిని పణంగా పెట్టినట్లేనని ఉస్మానియా విశ్వ విద్యాలయం విద్యార్థులు తెలిపారు. పార్టీల ప్రలోభాలకు లొంగకుండా.. అభివృద్ధి చేసేవారికి తాము ఓటు వేస్తామని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఓటు హక్కు(Right to Vote)ను ప్రతి ఒక్కరూ పదునైన ఆయుధంలా వినియోగించాలని కోరారు. మనల్ని గెలిపించేవారిని మనం గెలిపించుకోవాలని పేర్కొన్నారు.
New Voters Opinion on Telangana Elections : పార్టీలన్నీ ప్రజాకర్ష మేనిఫెస్టో(Manifesto)ను విడుదల చేశాయని.. కానీ యువతలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేలా పథకాలు పెడితే మరింత బాగుండేదని వారు అభిప్రాయపడ్డారు. కొత్తగా ఓటు వేసే వారు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. పార్టీ టోపీ చూసి కాకుండా మనకు టోపీ పెట్టని వారిని ఎన్నుకోవాలని అన్నారు. ఎన్నికల రోజును హాలీడేగా భావించకుండా.. ఐదేళ్ల అభివృద్ధికి బాటలు వేయడానికి లభించిన అవకాశంగా భావించాలన్నారు. రాష్ట్రంలో పోలీంగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని తెలిపారు.