boy died falling under the tractor in karimnagar : కుక్క నుంచి తప్పించుకోబోయి ట్రాక్టర్ కింద పడిపోయాడు.. - Inugala Dhanush
🎬 Watch Now: Feature Video
Student died Viral video : జీవితం క్షణభంగురం అన్నట్లు ఎప్పుడు ఎం జరుగుతుందో ఎవరూ ఊహించలేము. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలోకి విద్యార్థులను చేర్చుకోవడానికి విద్యా ఉత్సవాలు జరుగుతున్నాయి. విద్యా ఉత్సవాలలో పాల్గొన్న విద్యార్థి.. తోటి స్నేహితులతో కలిసి కిరాణాషాపుకు వెళ్తుండగా ఊహించని సంఘటన చోటు చేసుకుంది. చూస్తుండగానే పసి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. విద్యా ఉత్సవాల వేళ ట్రాక్టర్ కింద పడి చనిపోయిన విద్యార్థి సీసీ ఫుటేజ్‌ను పోలీసులు విడుదల చేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో... ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఆరో తరగతి విద్యార్థి ఇనుగాల ధనుష్.. ఈనెల 20న విద్యా పండుగ సందర్భంగా పాఠశాలకు వెళ్లాడు. వేడుకల్లో భాగంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహిస్తుండగా.. ధనుష్ కిరాణ దుకాణానికి పరుగెత్తాడు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న కుక్కలు తనవైపు వస్తున్నట్లు గమనించి... బెదిరిపోయాడు. వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అటుగా వెళ్తున్న ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. ధనుష్ మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.