Strange tradition in Jagtial : గ్రామంలో వింత ఆచారం.. పాత దుస్తులు, చీపుర్లు పట్టుకుని - Telangana Latest News
🎬 Watch Now: Feature Video
Strange tradition in Walgonda village of Jagtial district : కొన్ని గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు పాటింటే ఆచారాలు, విశ్వాసాలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. నేడు టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందిన.. ఈ రోజుల్లో ఇలాంటి వాటిని నమ్మడమేంటని.. బయటి వారు ముక్కున వెేలేసుకుంటారు. తమ గ్రామానికి కీడు సోకిందంటూ గ్రామస్థులు ఇంటికొకరు చొప్పున చీపురులతో జట్టక్క పాయే లక్ష్మీ వచ్చి అంటూ వీధిలో గుండా తిరిగి గ్రామ శివారులో వాటిని తగలబెట్టిన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామంలో మగవారు అందరూ కలిసి వినూత్నంగా చీపుర్లు పాత దుస్తులు చేత పట్టుకొని జెట్టక్క పోవాలి అంటూ.. నినాదాలు చేస్తూ ఒకరినొకరు కొట్టుకుంటూ ముందుకు సాగారు. పాత దుస్తులు చీపుర్లు పట్టుకొని ఊరేగింపుగా గ్రామ శివారుకు వెళ్లి చెట్లకు పాత దుస్తులు కట్టి చీపిర్లతో కొడుతూ జెట్టక్క పోవాలి అంటే నినాదాలు చేశారు. ఇది ఆనవాయితీగా వస్తుందని ఇలా చేస్తే గ్రామానికి ఎలాంటి కీడు సోకకుండా ఊరిలో అందరూ సుఖశాంతులతో ఉంటారని గ్రామస్థులు తెలిపారు.