thumbnail

కరెన్సీ నోట్లతో ధర్మారంలో మహాలక్ష్మీ అమ్మవారి అలంకరణ

By ETV Bharat Telangana Team

Published : Nov 12, 2023, 4:00 PM IST

Sri Mahalakshmi Ammavari Temple Dharmaram : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్ నగరంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నాణెలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించిన అర్చకులు.. కరెన్సీ నోట్లతో అమ్మవారిని అందంగా తీర్చిదిద్దారు. అంతకుముందుగా అమ్మవారికి 18 రకాల నైవేద్యాలను సమర్పించారు. కరెన్సీ నోట్లతో కొలువుదీరిన అమ్మవారిని చూడడానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు.

Goddess Mahalakshmi Decorated With Currency Notes : దీపావళి అనగానే ముందుగా గుర్తొచ్చేవి.. కాంతిని వెదజల్లే దీపాలు.. ఊరూ వాడా, పల్లె పట్నం అనే తేడా లేకుండా.. ప్రతి ఇళ్లు దీపాల వెలుగులతో విరాజిల్లుతోంది. రాత్రివేళ చీకటిని చీల్చుతూ మిరుమిట్లు గొలిపే టపాకాయలు.. నోటిని తీపిచేసే తీపి పదార్థాలు.. ఇవన్నీ పండగ సందడిని రెట్టింపు చేస్తాయి. మరోవైపు పండక్కి అవసరమైన ప్రమిదలు, టపాకాయల కొనుగోలులో జనం బిజీ అయ్యారు. మార్కెట్లు కొనుగోలుదారులతో సందడిగా మారాయి. వివిధ దుకాణాలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించటంతో రద్దీగా మారాయి. అలాగే దీపావళి వేళ వరంగల్​లోని పలు ఆలయాలు​ విద్యుత్‌ దీపాల వెలుగుల్లో వెలిగిపోతున్నాయి. అదేవిధంగా వివిధ దుకాణ సముదాయాలు.. దీపాల వెలుగులో కాంతులీనుతున్నాయి. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.