నేను మాస్ లీడర్‌ను, ఆ పదవితో నా కాళ్లు, చేతులు కట్టేశారు - స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు - స్పీకర్ ప్రసాద్‌కుమార్
🎬 Watch Now: Feature Video
Published : Jan 7, 2024, 4:25 PM IST
|Updated : Jan 7, 2024, 4:59 PM IST
Speaker Gaddam Prasad Kumar Interesting Comments : తన పదవిపై శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మాస్ లీడర్నని, ముఖ్యమంత్రి తనకు స్పీకర్ పదవి అప్పగించి కాళ్లు, చేతులు కట్టేశారని పేర్కొన్నారు. ఊర్లల్లో తిరుగుతూ, అందరిని కలిసి స్నేహం చేసే తనకు ఈ పదవి కొత్తగా ఉందన్నారు. అయిన తనపై నమ్మకంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అప్పగించిన పదవికి న్యాయం చేస్తానని ఆయన తెలిపారు.
Speaker Gaddam Prasad Kumar : హైదరాబాద్ రవీంద్రభారతిలో గోల్కొండ సాహితీ కళాసమితి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక, తెలుగు భాష చైతన్య సమితి, లక్ష్య సాధన ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల నుంచి శాసన సభాపతిగా నియమితులైన గడ్డం ప్రసాద్ కుమార్‌కు సాహిత్య, సాంస్కృతిక సంస్థలు సన్మాన సభ ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర స్పీకర్‌గా విధులను నిర్వహించి మంచి పేరు తెచ్చుకుంటానని ఆయన అన్నారు. గత పాలకులు కవులను దక్కాల్సిన గౌరవాన్ని ఇవ్వలేదని తాను మాత్రం ప్రభుత్వ పరంగా, వ్యక్తిగతంగా అన్ని విధాలా వారికి అండగా ఉంటానని స్పీకర్ స్పష్టం చేశారు.