Prajavani Programme in Karimnagar : అధికారులకు విశ్రాంతి కేంద్రంగా మారిన ప్రజావాణి.. వీడియో వైరల్ - చర్చనీయాంశంగా ప్రజావాణి కార్యక్రమం
🎬 Watch Now: Feature Video
Officials Sleepy in Prajavani Programme : కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమం కొందరు అధికారులకు విశ్రాంతి కేంద్రంగా మారింది. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికై వారి నుంచి వచ్చే దరఖాస్తులను పరిశీలించేందుకు కరీంనగర్ జిల్లాలోని అధికారులు ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిలో పాల్గొంటారు. అలాగే ఇవాళ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉన్నతస్థాయి అధికారులు ఆర్జీలు తీసుకోవడంలో బీజీగా ఉంటే... కొందరు కిందిస్థాయి అధికారులు మాత్రం మాకెందుకులే అన్నట్లు ప్రవర్తించారు. చల్లటి ఏసీలో గంటలపాటు కొందరు అధికారులు నిద్రమత్తులో మునిగి పోయారు.
ఇద్దరు ముగ్గురు అధికారులు నిద్రలో మునిగిపోతే... మరో ఉద్యోగి మొబైల్ ఫోన్లో క్రికెట్ చూస్తూ సరదా గడిపాడు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని జిల్లా అధికారులు విశ్రాంతి లేకుండా... ఈ కార్యకమ్రం నిర్వహిస్తుంటే కిందిస్థాయి అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహారించారు. ప్రజల సమస్యలను పట్టించుకోవాల్సిన అధికారులే ఇలా వ్యవహారించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇకనైనా ప్రజావాణి కార్యక్రమం సజావుగా సాగేందుకు జిల్లా అధికారులు సరైన అధికారులను కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.