SIT team investigating Chandrababu తాడేపల్లి సిట్‌ కార్యాలయంలో చంద్రబాబు.. 5 గంటలైనా అంతుచిక్కని సీఐడీ అధికారుల వ్యూహం!

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2023, 10:32 PM IST

thumbnail

 SIT to Investigate on AP Skill Development Case: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఆరోపణలపై.. చంద్రబాబును అరెస్టు చేసిన పోలీసులు తాడేపల్లిలోని సిట్‌ కార్యాలయానికి తరలించారు. 6 గంటలకు ప్రారంభమైన సిట్( SIT) విచారణ ఇంకా కొనసాగుతోంది. సిట్  కార్యాలయంలోనే చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు.  చంద్రబాబు(Chandrababu) తరపు న్యాయవాదులను పోలీసులు సిట్‌ కార్యాలయంలోకి అనుమతించలేదు. న్యాయవాదులను అనుమతించకపోవడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అడ్వకెట్లను అనుమతించి.. చంద్రబాబు లాయర్లు నిలిపివేయడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం అరెస్ట్ నుంచి ఇప్పటి వరకు నిబంధనలకు విరుద్ధంగా దర్యాప్తు అధికారులు పనిచేస్తున్నారని ఆరోపించారు. ఏ నిబంధనల ప్రకారం, ఎందుకు అనుమతించడం లేదో చెప్పాలంటూ అడ్వకేట్లను డిమాండ్ చేశారు.  

రెండు గంటల నిరీక్షణ అనంతరం అనుమతి:  తాడేపల్లి సిట్​ కార్యలయంలో చంద్రబాబును కలవడానికి  నారా లోకేష్(Nara lokesh), భువనేశ్వరిలను కలవడానికి పోలీసులు మెుదట అనుమతించలేదు.. రెండుగంటల నిరీక్షణ  అనంతరం..  చంద్రబాబుతో మాట్లాడేందుకు కుటుంబసభ్యులకు అనుమతించారు. చంద్రబాబును కలిసి మాట్లాడిన లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి, బాలకృష్ణ... సందర్భంగా వారితో మాట్లాడిన చంద్రబాబు  ఎవరూ ఆందోళన చెందవద్దని కోరిన చంద్రబాబు తెలిపారు. చంద్రబాబుతో మాట్లాడిన అనంతరం కుటుంబసభ్యులు సిట్ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.