golden saree in the matchbox : లోక్‌సభ మాజీ స్పీకర్‌కు బహుమతిగా 'బంగారు చీర' - Sircilla weaver gifts golden saree to Meera kumari
🎬 Watch Now: Feature Video
Man offers matchbox saree to meera kumari : సిరిసిల్ల చేనేత కళాకారులు అనునిత్యం వినూత్న ఆలోచనలకు పదును పెడుతూ సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒక వ్యక్తి అగ్గిపెట్టెలో దూరే బంగారు చీరను తయారుచేసి మాజీ స్పీకర్ మీరా కుమారికి అందజేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన నేత కార్మికుడు నల్ల విజయ్ గతంలో దబ్బనంలో పట్టే చీర, అగ్గిపెట్టెలో ఇమిడే చీరలను తయారుచేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. గతంలో కూడా దక్షిణకాశీగా పేరుగాంచిన శ్రీరాజరాజేశ్వరి దేవి అమ్మవారికి అగ్గి పెట్టెలో దూరే రెం డు గ్రాముల బంగారంతో నేసిన చీరను కానుకగా సమర్పించారు.
ఇటీవల కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ కోరిక మేరకు విజయ్ ఓ చీరను తయారు చేశాడు. రెండు గ్రాముల బంగారం, 48 ఇంచుల వెడల్పు, ఐదున్నర మీటర్ల పొడవు గల ఈ చీరను అగ్గిపెట్టలో ఇమిడే విధంగా రూపొందించాడ. పొన్ననం ప్రభాకర్ విజ్ఞప్తి మేరకు ఈ అగ్గిపెట్టెలో పట్టే బంగారు చీరను విజయ్.. మాజీ స్పీకర్ మీరా కుమారికి అందజేశాడు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా హైదరాబాద్ వచ్చిన మీరా కుమారికి గాంధీ భవన్లో ఈ చీరను బహుమతిగా సమర్పించాడు.