thumbnail

వృద్ధుడికి చికిత్స కోసం 5 కిలోమీటర్లు డోలీలోనే- స్వాతంత్ర్యం నాటి నుంచి రోడ్డు లేని గ్రామం!

By ETV Bharat Telugu Team

Published : Nov 3, 2023, 10:34 AM IST

Sick Tribal Man Carried On Doli video viral : రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల.. అనారోగ్యంతో ఉన్న ఓ గిరిజన వృద్ధుడిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు 5 కిలోమీటర్లు డోలీలో మోసుకెళ్లారు ఇద్దరు యువకులు. గుజరాత్​.. సాబర్​కాంఠా జిల్లా పోశిన మండలంలోని బుజకర్మాదిపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. అయితే సదరు గ్రామానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రోడ్డు వేయలేదు. దీంతో ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆ గ్రామం నోచుకోలేదు. ఇక ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరైనా అనారోగ్యానికి గురైతే అంబులెన్స్​ రావడం కూడా కష్టమే. దీంతో చేసేదేమీ లేక డోలీ కట్టి ఆస్పత్రికి తరలించాల్సిన దుస్థితి ఏర్పడింది.  

ఇలాంటి ఘటన ఈ ఏడాది ఫిబ్రవరిలో మహారాష్ట్రలో జరిగింది. పాల్ఘర్​ జిల్లాలోని ముంకుందపాద అనే గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల.. నిండు గర్భిణీని ప్రసవం కోసం 4 కిలోమీటర్ల దూరం డోలీలో మోసుకెళ్లారు. అనంతరం అక్కడినుంచి రోడ్డు మార్గంలో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.