Shri Devi Sharannavaratri Mahotsav in Bhadradri : సంతాన లక్ష్మీగా భద్రాద్రి అమ్మవారి దర్శనం.. పోటెత్తిన భక్తజనం
🎬 Watch Now: Feature Video
Published : Oct 16, 2023, 4:57 PM IST
Shri Devi Sharannavaratri Mahotsav in Bhadradri : భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో ఉపాలయంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారు రోజుకు ఒక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాలలో రెండో రోజైన నేడు శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారు సంతాన లక్ష్మీ అలంకరణలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ అలంకరణలో వున్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సంతాన భాగ్యంతో పాటు విద్యాబుద్ధులు కూడా అందుతాయని ఆలయ వేద పండితులు కృష్ణమాచార్యులు తెలుపుతున్నారు.
Devi Navaratri Celebrations 2023 : ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారికి పంచామృతాలతో విశేష అభిషేకం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం మహిళల చేత సామూహిక కుంకుమ అర్చనలు మంత్రపుష్పం, సాయంత్రం సీతారాములకు తిరువీధి సేవ ఉత్సవాన్ని జరుపుతున్నారు. ఈ అలంకరణలలో వున్న అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలం వస్తున్నారు. దీంతో పరిసరప్రాంతాలన్నీ భక్తకోటి జనసంద్రంగా మారాయి.