Shri Devi Sharan Navaratri Mahotsav in Telangana : రాష్ట్రమంతటా వైభోవపేతంగా అమ్మవారి అలంకరణలు.. దర్శించుకునేందుకు పెద్దఎత్తున భక్తులు - తెలంగాణలో దసరా వేడుకలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-10-2023/640-480-19789395-thumbnail-16x9-telangana-navaratri-festivals.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Oct 17, 2023, 4:50 PM IST
Shri Devi Sharan Navaratri Mahotsav in Telangana : రాష్ట్రంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రోజుకో రూపంలో భక్తులకు దర్శనభాగ్యం కలిగించేలా అమ్మవారి అలంకరణను నిర్వాహకులు రూపొందిస్తున్నారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలలో.. మూడవ రోజైన నేడు అమ్మవారు గజలక్ష్మీ అలంకరణలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఇవాళ అమ్మవారి మూలమూర్తికి విశేషాభిషేకం నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం లక్ష్మీ తాయారు అమ్మవారి మూలమూర్తికి విశేషాభిషేకం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం మహిళల చేత సామూహిక కుంకుమార్చనలు, మంత్రపుష్పం ఉత్సవం నిర్వహిస్తున్నారు. సాయంత్రం సీతారాములకు తిరువీధి ఉత్సవాన్ని జరుపనున్నారు.
అదేవిధంగా వరంగల్లో శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ అమ్మవారిని గాయత్రీ అలంకరణలో అలంకరించారు. ఐదు ముఖాలతో కూడిన గాయత్రీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.
TAGGED:
Devi Sarannavaratrulu 2023