Ujjain Mahankali Bonalu Festival : కన్నుల పండుగగా మహంకాళీ బోనాలు.. సందడి చేస్తున్న యువత - తెలంగాణ బోనాలు
🎬 Watch Now: Feature Video
Ujjain Mahankali Bonalu 2023 : ఆషాఢ మాస బోనాలలో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బోనాలు కావడంతో చిన్నాపెద్దా అందరూ సందడి చేస్తున్నారు. మహంకాళి అమ్మవారికి భక్తులు పెద్ద ఎత్తున హాజరై.. మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. వేకువజామున తొలి బోనాన్ని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కుటుంబం సమర్పించింది. పోతురాజులు తమ నృత్యాలతో అందరినీ అలరించారు.
అమ్మవారి ఘటాలు ఊరేగింపుగా వెళుతుంటే.. అందరూ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. సికింద్రాబాద్‌లో అమ్మాయిలు బోనాలతో కోలాహలం చేశారు. ఆ పరిసర ప్రాంతాల్లో పండగ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా.. చక్కటి చీరకట్టులతో ఉజ్జయిని మహంకాళి తల్లికి బోనాలు సమర్పించారు. ఆలయాన్ని చక్కగా పూలతో అలంకరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది.