లైంగిక వేధింపులకు పాల్పడిన టీచర్‌కు దేహశుద్ధి - ఆర్మూర్ టీచర్ అరెస్ట్ లెటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Published : Nov 25, 2023, 3:08 PM IST
School Teacher Sexual Harassment At Nizamabad : బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థిని పట్ల వికృతంగా ప్రవర్తించాడు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు నీచమైన పనికి దిగజారాడు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ లోని ఉర్దూ మీడియం పాఠశాలలో విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో గల ఉర్దూ మీడియం ప్రైమరీ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఇబ్రహీం అనే ఉపాధ్యాయుడు విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
Teacher Sexual Harassment : ఈ విషయం విద్యార్థిని కుటుంబ సభ్యులు ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఎంఈఓ రాజా గంగారాంకు ఫిర్యాదు చేయగా బాధ్యులైన వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి ఘటనలు తరచూ జరగడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనర్ బాలికల పైన ఇలాంటి చర్యలను పునరావృతం కాకుండా చట్టపరమైన శిక్షను ఉపాధ్యాయునికి వేయాలని.. లేని పక్షంలో ఆందోళన చేస్తామని విద్యార్థిని తల్లిదండ్రులు హెచ్చరించారు.