రంగోలీతో అతి చిన్న సాయిబాబా చిత్రం వేసిన టీచర్ ప్రపంచ రికార్డు దాసోహం - స్కూల్ టీచర్ సృష్టించిన సరికొత్త రికార్డ్ న్యూస్
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్రలో శిరిడీ అహ్మద్‌నగర్ జిల్లాలోని కోపర్‌గావ్‌కు చెందిన మసూద దారూవాలా అనే స్కూల్ టీచర్ ప్రపంచ రికార్డు సృష్టించారు. అతి తక్కువ సమయంలో అతిచిన్న సాయిబాబా చిత్రాన్ని వేసి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేరారు. మసూద శిరిడీలోని సంజీవని ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో టీచర్. 40 నిమిషాల్లో రంగోలీతో బాబా చిత్రాన్ని వేసి కింగ్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. గతంలో ఉన్న 5 సెంటీమీటర్ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి, అతి తక్కువ స్థలంలో పోర్ట్రెయిట్ రంగోలి గీసినందుకు మసూద ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST