పాఠశాలను 'మిర్చి స్కూల్'గా మార్చిన ఛైర్మన్ - జయశంకర్ భూపాలపల్లి తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
mirchi school in jayashankar bhupalapally: పాఠశాలలలో పాఠాలు చెబుతారు. పిల్లల చదువుల కోసం ఉన్న బడులను సొంత అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు. పాఠశాలలో మిరపకాయలు ఆరబోయడం ఎప్పుడైనా చూశారా. పాపం ఎవరో రైతు ఎక్కడా స్థలం లేక బడిలో పోశాడేమో అనుకోవద్దు. ఆ పాఠశాల చైర్మన్ ఈ పని చేశాడు. వినటానికి నమ్మశక్యంగా లేకపోయినప్పటికీ ఇది నిజం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమేల మండలం కేంద్రంలో ప్రాథమికొన్నత పాఠశాల మిర్చి కళ్లెంగా మారింది. అకాల వర్షానికి మిర్చి తడిసిందని, దానిని ఆరబోయటానకి పాఠశాలను ఉపయోగించుకున్నాడు. ఆదివారం రాత్రి తరగతి గదిలో మిర్చి అంతా తెచ్చి ఆరబోశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పాఠశాలకు వచ్చి ఎందుకిలా చేశారని సదరు వ్యక్తిని ప్రశ్నిస్తున్నారు. సొంత అవసరాలకు పాఠశాలను ఉపయోగించుకోవడం వల్ల విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడిందని, మిర్చి ఘాటుకు పిల్లలకు ఇబ్బంది కలుగుతుందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు వ్యక్తిపై తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.