School Bus Accident in Mahabubnagar : స్కూల్ బస్సు బోల్తా.. 20 మంది విద్యార్థులకు గాయాలు - మహబూబ్నగర్లో స్కూల్బస్సలు ఢీకొన్న లారీ
🎬 Watch Now: Feature Video
Published : Oct 9, 2023, 12:58 PM IST
School Bus Accident in Mahabubnagar : మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రైవేటు పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. మహబూబ్నగర్ నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న మౌంట్ బాసిల్ పాఠశాలకు చెందిన ఏడో నంబర్ బస్సు కొత్తతండా వద్ద పాఠశాల వైపునకు మళ్లుతుండగా వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో పాఠశాల బస్సు డివైడర్ పై బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30మందికి పైగా విద్యార్ధులు ఉన్నారు. వీరిలో 20 మందికి పైగా గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
గాయాలైన విద్యార్ధులను మహబూబ్నగర్ ఎస్వీఎస్, ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ విద్యార్ధుల తల్లితండ్రులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా స్కూల్ బస్సులు ప్రమాదాలకు గురి కావడం పిల్లల తల్లిదండ్రుల ఆందోళనకు కారణం అవుతున్నాయి.