SCCL Thirty Two Percent Share to Workers : సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. రూ.700 కోట్ల బోనస్ - సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-09-2023/640-480-19612980-thumbnail-16x9-singareni-workers.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Sep 26, 2023, 6:06 PM IST
|Updated : Sep 26, 2023, 6:35 PM IST
SCCL Thirty Two Percent Share to Workers : సింగరేణి సంస్థ.. కార్మికులకు మరో శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఆదేశాల మేరకు సింగరేణి సంస్థలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి వచ్చిన లాభాల వాటాలో.. 32 శాతాన్ని ఉద్యోగులకు ఇవ్వాలని నిర్ణయించింది. గత వారమే సింగరేణి సంస్థ(Singareni Company) తమ ఉద్యోగులకు 11వ వేజ్ బోర్డు 39,413 మంది ఉద్యోగులకు ఎరియర్స్ రూ.1,450 కోట్లు ఉద్యోగుల ఖాతాలో జమచేసింది. తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్టే వారి ఖాతాల్లో డబ్బులు జమ కావడంతో సింగరేణి కార్మికుల్లో పండగ వాతావరణం నెలకొంది. పెద్ద మొత్తంలో బకాయిలు పొందిన కార్మికులు ఈ సొమ్మును పొదుపుగా వినియోగించి తమ కుటుంబాల భవిష్యత్‌కు సద్వినియోగం చేసుకోవాలని సంస్థ పేర్కొంది. ఇంత పెద్ద మొత్తంలో చెల్లించడం సింగరేణి చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.
TS Government Good News To Singareni Workers : తాజాగా దసరా బోనస్‌ను కూడా విడుదల చేయడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు సుమారు రూ.700 కోట్ల వరకు సంస్థలో వచ్చిన లాభాలను ఇవ్వనున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.700 కోట్ల లాభాల బోనస్‌ను దసరాలోపు చెల్లించేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికులకూ.. దసరా, దీపావళి బోనస్‌గా రూ.1000 కోట్లు పంపిణీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.