డా.బీఆర్ అంబేడ్కర్​కు నివాళులర్పించిన రాజాసింగ్​ - మండిపడ్డ దళిత సంఘాలు - SC Leaders fight at Tankband Ambedkar Statue

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Dec 6, 2023, 6:58 PM IST

SC Leaders Protest against BJP MLA Raja Singh : హైదరాబాద్​ ట్యాంక్​ బండ్​ పరిసరాలలో ఉన్న అంబేడ్కర్​ విగ్రహం దగ్గర బీజేపీ, దళిత సంఘం నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇవాళ డా.బాబా సాహెబ్​ అంబేడ్కర్ (Dr.B.R Ambedkar) వర్ధంతి సందర్భంగా ​విగ్రహానికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో అంబేడ్కర్​ విగ్రహానికి నివాళులర్పించేందుకు వచ్చిన రాజాసింగ్​ను ఎస్సీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి తోపులాట చోటు చేసుకుంది. 

కొద్ది సేపటి వరకు ఇరువర్గాల నాయకుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకొని ఇరువురిని చెదరగొట్టారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్​ మాజీ ఛైర్మన్​ పిడమర్తి రవి మీడియా విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని గౌరవించని రాజాసింగ్ లాంటి నాయకులకు అంబేడ్కర్​ విగ్రహానికి నివాళులర్పించే హక్కులేదని మండిపడ్డారు. దళితుల ఆహార అలవాట్లు, జీవనశైలిపై విషం చిమ్మే వ్యక్తి రాజాసింగ్ అని ఆరోపించారు.  

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.